గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం: ఘంటసాల వెంకటేశ్వర రావు
రచన: రావులపర్తి భద్రిరాజు
_________________________________________________________________________________
పల్లవి:
నమో వెంకటేశా..
నమో తిరుమలేశా..
నమస్తే నమస్తే నమః... ఆ...
నమో వెంకటేశా నమో తిరుమలేశా..
మహానందమాయే ఓ మహాదేవదేవ || నమో వెంకటేశా ||
చరణం 1:
ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా || 2 ||
ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా || నమో వెంకటేశా ||
చరణం 2:
నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా || 2 ||
మనుజులు నిను చేరే పరమార్ధము తెలుపవయా
పరమార్ధము తెలుపవయా || నమో వెంకటేశా ||
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి