4, అక్టోబర్ 2011, మంగళవారం

ఓయ్ - సరదాగా చందమామనే


గాయకులు: కార్తీక్, సునిధి చౌహాన్ 


సంగీతం : యువన్ శంకర్ రాజా

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

సరదాగా చందమామనే చేతివేళ్లపై నిలబెడతావా
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటకట్టుకుని నింగి మధ్యలో పరిగెడుతావా
వందడుగుల నీటి మధ్యలో నిట్ట నిలువునా నిలబడతావా
నా గుండెల్లో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కోరితే ఎలాగో ఎలాగో మారి

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నా ఓ.. ఆ ఆశల లొతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ.. ఆనందపు అంచు తాకలేనా                                             || సరదాగా ||


చరణం 1:

చిగురులతోనే చీరలు నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండ అంతకు మించి అందించేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా                                                   || నా ప్రేమగ ||          || సరదాగా ||


చరణం 2:

మెలకువలోన కలలను కన్నా నిజములు చేస్తావని
చిలిపిగ నేనే చినుకవుతున్నా నీ కల పండాలని ఓ..
పిలువకముందే ప్రియా అంటు నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములొనే అమృతమేదో నింపెయవా                                              || నా ప్రేమగ ||         || సరదాగా ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి