గానం: చిత్ర
సంగీతం: మాధవపెద్ది సురేష్
రచన: సింగీతం శ్రీనివాసరావు
_________________________________________________________________________________
పల్లవి:
విరిసినది వసంత గానం వలపుల పల్లవి గా || 2 ||
మనసే మందారమై, వయసే మకరందమై అదేదో మాయ చేసినదీ... || విరిసినది ||
చరణం 1:
ఝుమ్మంది నాదం రతి వేదం జత కోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించె ఈ వని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడే చెలికాంతుడై దరిచేరే మెల్లగా... || విరిసినది ||
చరణం 2:
ఋతువు మహిమేదో, విరి తేనె జడి వానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి మురిసేను తనువు హాయిగా
రా చిలుక పాడగా.. రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడే సుకుమారుడై జతకోరె మాయగా || విరిసినది ||