9, నవంబర్ 2011, బుధవారం

తోటరాముడు - ఓ బంగరు రంగుల చిలకా



సంగీతం: సత్యం

గానం: S P బాలసుబ్రహ్మణ్యం, P సుశీల

రచన: రాజశ్రీ

_________________________________________________________________________________


పల్లవి


ఓ బంగరు రంగుల చిలకా.. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా.. ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని

ఓ అల్లరి చూపుల రాజా.. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా.. ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని



ఓ... ఓహోహో.. ఓ..
ఆ. ఆ.. ఆ. ఆ..


చరణం 1:


పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే                                  || ఓ బంగరు ||



చరణం 2:


సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే                                    || ఓ అల్లరి ||





4 కామెంట్‌లు:

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

ఈ సినిమాకి సంగీతం అందించింది సత్యం అండి. మాధవపెద్ది సత్యం కాదు. మాధవపెద్ది సత్యం గారు మంచి గాయకుడు మాత్సంరమే. గీతదర్శకుడైన సత్యం గారు వేరు. అతని ఇంటిపేరు చెళ్ళపిళ్ళ. ఆయన ప్రఖ్వాత కవీ, అవధానకర్తా, విశ్వనాథ సత్యనారాయణగారి గురువుగారూ, తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి మనవడు. వీలయితే మీబ్లాగ్ పోస్ట్ నీ సవరించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి