1, అక్టోబర్ 2011, శనివారం

కొంచెం ఇష్టం కొంచెం కష్టం - ఆనందమా.. ఆరాటమా..


గాయకులు: శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ 


సంగీతం : శంకర్-ఎహసాన్-లాయ్

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా ఏమిటో.. పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దహానిదా.. స్నేహానిదా.. ఈ సూచనా ఏమిటో.. తేల్చుకో నయనమా ఎవరివీ తొలుతవీ
పట్టుకో పట్టుకో చేయి జారనీయకా ఇకనైన.. 
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయాన
ఓ.. కంటికే దూరమై గుండెకే ఎంతగా చేరువైనా.. 
నమ్మవే మనసా కనపడినది కద ప్రతి మలుపున

నిన్ను కలిసే ముందు తెలుసా ఇదేం వరసా..


చరణం 1:

యెద సడి లో చిలిపి లయ, తమ వలనే పెరిగెనయా
తను తనువే తెలుపవయా ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ, ప్రియా..
ఒక క్షణము తోచనేవుగా కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడకా అదే పనిగా..

ఓ.. నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఓ.. ముందుగా చెప్పకా మంత్రమేశావే న్యాయమేనా
అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా
కొతగా మార్చనా నను మరి కని విని మరిపించన                                          || ఆనందమా.. ||


పట్టుకో పట్టుకో చేయి జారనీయకా ఇకనైన.. 
ఓ.. చుట్టుకో చుట్టుకో ముడి పడిపోయే మురిపాన
ఓ.. ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా.. 
కళ్లల్లో పెట్టుకో ఎదురుగ నిలవన ఎటు తిరిగిన



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి