1, అక్టోబర్ 2011, శనివారం

బద్రినాథ్ - నచ్చావురా



గాయకులు: శ్రీరామచంద్ర, చైత్ర


సంగీతం: ఎం ఎం కీరవాణి


రచన: ఎం ఎం కీరవాణి

_________________________________________________________________________________

పల్లవి

నచ్చావురా.. వదలనురా.. వదలనురా..
మెచ్చానురా.. జతపడరా.. జతపడరా..
వరసే మెచ్చి అడిగావేరా..
వరమే ఇచ్చి ఈ జలధారా
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా                          || నచ్చావురా ||


చరణం 1:

కనిపించేదాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడిచస్తుంది వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మొఉనభాషలను
వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా          || నచ్చావురా ||


చరణం 2:

బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
లేదా పొరపాటే చేసేమందే ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
ఆరంగనా సఖా తరించి వేరుకా
లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ వొళ్లో వాలెయ్యక               || నచ్చావురా ||


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి