4, అక్టోబర్ 2011, మంగళవారం

రుద్రవీణ - తరలి రాద తనే వసంతం


గాయకులు: S P బాలసుబ్రహ్మణ్యం 


సంగీతం : ఇళయరాజా

రచన : 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం                          || 2 ||
గగనాలదాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా                                       || తరలి రాద ||


చరణం 1:

వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగుకదా                           || 2 ||
ఎల్లలు లేని చల్లని గాలి అందరికోసం అందును కాదా
ప్రతీ మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద                                          || తరలి రాద ||


చరణం 2:

బ్రతుకున లేని శ్రుతి కలదా యెద సడిలోన లయ లేదా                        || 2 ||
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజా ధనం కాని కళావిలాసం ఏ ప్రయోజనం లేని వృధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పాడే మరో పధం రాదా
మురళికిగల స్వరముల కల పెదవిని విడి పలుకదు కద                                          || తరలి రాద ||


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి