13, అక్టోబర్ 2011, గురువారం

బద్రినాధ్ - చిరంజీవ చిరంజీవ




గానం: రేవంత్, శ్రేయ ఘోషల్, గీతా మాధురి,


సంగీతం: ఎం. ఎం. కీరవాణి,


రచన: చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ                                                            || 2 ||

జన్మించా మరో సారి జీవించా నిన్నే కోరి దివి దిగి వచ్చా నీదరి నందా
సంధించా నీపై గురి సాధించా సరాసరి సరసకు వచ్చా అలకలనంద
అలకేదో పిలుపిచ్చింద అది నీకే తెలిసొచ్చిందా
విధి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా                                               || చిరంజీవ ||     || 2 ||


చరణం 1:

ఝుం ఝుమ్మని ఝుం ఝుమ్మని మంత్రం లా నీ అలోచనలే
రా రమ్మని రగిలిస్తే వస్తున్నా
రిం ఝిమ్మని రిం ఝిమ్మని వర్షం లా నీ ఆశల జల్లే 
నా కొమ్మను కదిలిస్తే లేస్తున్నా
మనసును మాత్రం చదివే ప్రాణాక్షరాల ప్రేమల గీతం రాస్తున్నా
రాసిందే జరిగుంటుందా రాయందే ఎదురయ్యిందా
ఒక రాయంటి యెద నేడు రవళించిందా                                              || చిరంజీవ ||     || 2 ||


చరణం 2:

ఘుం ఘుమ్మని ఘుం ఘుమ్మని గుండెల్లో గువ్వలుగా ఎగసే
ఘుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్నా
ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో ఏం తోచక నేనే 
గొంతెత్తని గిలిగింతై చూస్తున్నా
మాటలకద్దం పట్టే మౌనామృతాల
ముద్దుల పట్టా ఇస్తున్నా
ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా ఉందా
ఇక నాలోన నాదంటూ వేరే ఉందా                                                      || చిరంజీవ ||     || జన్మించా ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి