4, అక్టోబర్ 2011, మంగళవారం

పూజ - ఎన్నెన్నో జన్మల బంధం


గాయకులు: S P బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం 


సంగీతం : రాజన్-నాగేంద్ర

రచన : దాశరధి కృష్ణమాచార్యులు

_________________________________________________________________________________

పల్లవి

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది..
ఎన్నటికీ మాయని మమత నాది నీది..
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను                                             || ఎన్నెన్నో ||


చరణం 1:

పున్నమి వెన్నెలలోన పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓ హో హో హో నువ్వు కడలివైతే.. నే నదిగ మారి..
చిందులు వేసి వేసి నిన్ను చేరనా.. చేరనా.. చేరనా..                       || ఎన్నెన్నో ||


చరణం 2:

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
తావిని నేనై నిన్ను పెనవేసేను
ఓ హో హో హో మేఘము నేవై.. నెమలి నేనై..
ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..                   || ఎన్నెన్నో ||


చరణం 3:

ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఆ ఆ హా హా..
కోటి జన్మలకైనా.. కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ.. నేనుండాలి
ఓ హో హో హో నీవున్న వేళా.. ఆ స్వర్గమేలా..
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..                    || ఎన్నెన్నో || 



1 కామెంట్‌లు:

for mp3 songs downloads at http://raaga9.blogspot.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి