ఊసరవెల్లి

తారాగణం: ఎన్.టి.ఆర్, తమన్నా, ప్రకాష్ రాజ్; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సురేందర్ రెడ్డి

శక్తి

తారాగణం: ఎన్.టి.ఆర్., ఇలియానా; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: మెహర్ రమేష్

బృందావనం

తారాగణం: ఎన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్, సమంత, ప్రకాష్ రాజ్, శ్రీహరి; సంగీతం: తమన్; దర్శకత్వం: వంశీ పైడిపల్లి

అదుర్స్

తారాగణం: ఎన్.టి.ఆర్, నయనతార, షీలా; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: వి.వి.వినాయక్

కంత్రి

తారాగణం: ఎన్.టి.ఆర్, హన్సిక, తనీషా; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: మెహర్ రమేష్

యమదొంగ

తారాగణం: ఎన్.టి.ఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

రాఖీ

తారాగణం: ఎన్.టి.ఆర్, ఇలియాన, ఛార్మి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: కృష్ణవంశీ

అశోక్

తారాగణం: ఎన్.టి.ఆర్, సమీరా రెడ్డి; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: సురేందర్ రెడ్డి

ఆంధ్రావాలా

తారాగణం: ఎన్.టి.ఆర్, రక్షిత, సంఘవి; సంగీతం: చక్రి; దర్శకత్వం: పూరి జగన్నాధ్

దూకుడు

తారాగణం:మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్; సంగీతం: తమన్; దర్శకత్వం: శ్రీను వైట్ల

ఆర్య-2

తారాగణం: అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్దా దాస్; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

ఆర్య

తారాగణం: అల్లు అర్జున్, అనురాధా మెహతా, శివ బాలాజి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

Mr పర్ ఫెక్ట్

తారాగణం: ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: దశరధ్

డార్లింగ్

తారాగణం: ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్దా దాస్, ప్రభు; సంగీతం: జీ వీ ప్రకాష్ కుమార్; దర్శకత్వం: కరుణాకరన్

100% లవ్

తారాగణం: నాగ చైతన్య, తమన్నా; సంగీతం: దేవి శ్రీ ప్రసాద్; దర్శకత్వం: సుకుమార్

ఏ మాయ చేసావె

తారాగణం: నాగ చైతన్య, సమంత; సంగీతం: ఏ.ఆర్.రెహమాన్; దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్

ద్రోణ

తారాగణం: నితిన్, ప్రియమణి; సంగీతం: అనూప్ రూబెన్స్; దర్శకత్వం: జె.కరుణ కుమార్

లీడర్

తారాగణం: రాణా దగ్గుబాటి, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్; సంగీతం: మిక్కీ జె మేయర్; దర్శకత్వం: శేఖర్ కమ్ముల

యువత

తారాగణం: నిఖిల్, అక్ష; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: పరశురామ్

తీన్ మార్

తారాగణం: పవన్ కళ్యాణ్, త్రిష, కృతి ఖర్భంద; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ

ఓయ్

తారాగణం: సిధ్ధార్థ్, షామిలి; సంగీతం: యువన్ శంకర్ రాజా; దర్శకత్వం: ఆనంద్ రంగ

14, నవంబర్ 2011, సోమవారం

నాలుగు స్తంభాలాట - చినుకులా రాలి


సంగీతం: రాజన్-నాగేంద్ర


గానం: S P బాలసుబ్రహ్మణ్యం, P సుశీల


రచన: వేటూరి సుందరరామ్మూర్తి

_________________________________________________________________________________


పల్లవి:


చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ.
నదివి నీవు, కడలి నేను,
మరిచిపోబోకుమా మమత నీవే సుమా                                                || చినుకులా రాలి ||


చరణం 1:


ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచిఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లని గాలులే

హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా
విడిచిపోబోకుమా విరహమైపోకుమా                                                    || చినుకులా రాలి ||



చరణం 2:


తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుటున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం  వెసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నీడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై యెగసి
నీ ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ
భువనమైనా, గగనమైనా,
ప్రేమమయమే సుమా.. ప్రేమమనమే సుమా                                          || చినుకులా రాలి ||



9, నవంబర్ 2011, బుధవారం

తోటరాముడు - ఓ బంగరు రంగుల చిలకా



సంగీతం: సత్యం

గానం: S P బాలసుబ్రహ్మణ్యం, P సుశీల

రచన: రాజశ్రీ

_________________________________________________________________________________


పల్లవి


ఓ బంగరు రంగుల చిలకా.. పలకవే
ఓ అల్లరి చూపుల రాజా.. ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని

ఓ అల్లరి చూపుల రాజా.. పలకవా
ఓ బంగరు రంగుల చిలకా.. ఏమని
నా మీద ప్రేమే ఉందని
నా పైన అలకే లేదని



ఓ... ఓహోహో.. ఓ..
ఆ. ఆ.. ఆ. ఆ..


చరణం 1:


పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే                                  || ఓ బంగరు ||



చరణం 2:


సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే                                    || ఓ అల్లరి ||





2, నవంబర్ 2011, బుధవారం

ఊసరవెల్లి - బ్రతకాలి



గానం: దేవి శ్రీ ప్రసాద్



సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


రచన: చంద్రబోస్

_________________________________________________________________________________


పల్లవి:

ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలి ముద్దు
సర సర సరమంటూ విషమల్లే నర నరం పాకింది తొలి ముద్దు
గబ గబ గబమంటూ గునపాలై మెదడుని తొలిచింది తొలి ముద్దు
ఒక పరి వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలి ముద్దు                                      || ఫెళ ఫెళ ||

వదలనులే చెలీ చెలీ నిన్నే మరణం ఎదురు వచ్చినా
మరువనులే చెలీ చెలీ నిన్నే మరు జన్మెత్తినా


మెదలనులే ఇలా ఇలా భూమే నిలువున బద్దలయ్యినా
చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంతటిని చీరే ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధుర నాలలే కదిపి కుదుపుతోంది చెలియా

బ్రతకాలి... అని ఒక ఆశ రేగెలే
చంపాలి... వెంటాడే చావునే                || 2 ||                                                               || ఫెళ ఫెళ ||



చరణం 1:


ఒక యుధ్ధం, ఒక ధ్వంసం, ఒక హింసం నాలో రేగెలే
ఒక మంత్రం, ఒక మైకం, నాలో మోగెనే
ఒక జననం, ఒక ఛలనం, ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం, ఒక దాహం, నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే శతఘులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా                                                                         || బ్రతకాలి ||



చరణం 2:

                    
ఒక క్రోధం, ఒక రౌద్రం, భీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖ గీతం లోలో కలిగెనే
ఒక యోధం, ఒక యఙ్ఞం, నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం, ఒక భాగ్యం నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే జయాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా                                                                   || బ్రతకాలి ||




ఓ మై ఫ్రెండ్ - ఆలోచన వస్తేనే




గానం: రంజిత్, సంగీత ప్రభు, సారా స్ట్రాబ్


సంగీతం: రాహుల్ రాజ్


రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నాక్కనబడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాక నేనే నువ్వు నా పక్కన లేన్దే ఉన్నానంటే నమ్మాలో లేదో..
ఏనాడైనా ఈమాట నీతో అనగలనో లేదో

హో అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
హో ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం 


చరణం 1:

ప్రాయం ఉన్నా, పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదు
దారీ నేనై, దరినీ నేనై, నడిపిస్తాగా ప్రతీ అడుగు
బెదురుగా హా.. తడబడే మనసిదీ
కుదురుగా హా.. నిలపవా జతపడి                                                      || హో అంటున్నది ||


చరణం 2:

నీ కన్నులతో చూసేదాకా, స్వప్నాలంటే తెలీవెపుడూ
నా కల ఏదో గుర్తించగా నీ రూపంలో ఇలా ఇపుడూ
చలనమే హా.. కలగని చెలియలో.. హా...
సమయమే హా.. కరగని చెలిమిలో                                                     || ఆలోచన వస్తేనే ||



20, అక్టోబర్ 2011, గురువారం

వాన - ఎదుట నిలిచింది చూడు



గానం: కార్తీక్


సంగీతం: కమలాకర్


రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి


_________________________________________________________________________________

పల్లవి

ఎదుట నిలిచింది చూడు జలతార వెన్నెలేదో
యెదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయాను మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా              || ఎదుట నిలిచింది ||
                   


చరణం 1: 

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే అయితె ఆ నిజం ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా                          || ఎదుట నిలిచింది ||


చరణం 2: 

నిన్నే చేరుకోలేక ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా                     || ఎదుట నిలిచింది ||




13, అక్టోబర్ 2011, గురువారం

బద్రినాధ్ - చిరంజీవ చిరంజీవ




గానం: రేవంత్, శ్రేయ ఘోషల్, గీతా మాధురి,


సంగీతం: ఎం. ఎం. కీరవాణి,


రచన: చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

చిరంజీవ చిరంజీవ చిరంజీవ
సుఖీభవ సుఖీభవ సుఖీభవ                                                            || 2 ||

జన్మించా మరో సారి జీవించా నిన్నే కోరి దివి దిగి వచ్చా నీదరి నందా
సంధించా నీపై గురి సాధించా సరాసరి సరసకు వచ్చా అలకలనంద
అలకేదో పిలుపిచ్చింద అది నీకే తెలిసొచ్చిందా
విధి ప్రాయాల పూమాల తెగ నచ్చిందా                                               || చిరంజీవ ||     || 2 ||


చరణం 1:

ఝుం ఝుమ్మని ఝుం ఝుమ్మని మంత్రం లా నీ అలోచనలే
రా రమ్మని రగిలిస్తే వస్తున్నా
రిం ఝిమ్మని రిం ఝిమ్మని వర్షం లా నీ ఆశల జల్లే 
నా కొమ్మను కదిలిస్తే లేస్తున్నా
మనసును మాత్రం చదివే ప్రాణాక్షరాల ప్రేమల గీతం రాస్తున్నా
రాసిందే జరిగుంటుందా రాయందే ఎదురయ్యిందా
ఒక రాయంటి యెద నేడు రవళించిందా                                              || చిరంజీవ ||     || 2 ||


చరణం 2:

ఘుం ఘుమ్మని ఘుం ఘుమ్మని గుండెల్లో గువ్వలుగా ఎగసే
ఘుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్నా
ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో ఏం తోచక నేనే 
గొంతెత్తని గిలిగింతై చూస్తున్నా
మాటలకద్దం పట్టే మౌనామృతాల
ముద్దుల పట్టా ఇస్తున్నా
ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా ఉందా
ఇక నాలోన నాదంటూ వేరే ఉందా                                                      || చిరంజీవ ||     || జన్మించా ||



4, అక్టోబర్ 2011, మంగళవారం

రుద్రవీణ - తరలి రాద తనే వసంతం


గాయకులు: S P బాలసుబ్రహ్మణ్యం 


సంగీతం : ఇళయరాజా

రచన : 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం                          || 2 ||
గగనాలదాక అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా                                       || తరలి రాద ||


చరణం 1:

వెన్నెల దీపం కొందరిదా.. అడవిని సైతం వెలుగుకదా                           || 2 ||
ఎల్లలు లేని చల్లని గాలి అందరికోసం అందును కాదా
ప్రతీ మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద                                          || తరలి రాద ||


చరణం 2:

బ్రతుకున లేని శ్రుతి కలదా యెద సడిలోన లయ లేదా                        || 2 ||
ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజా ధనం కాని కళావిలాసం ఏ ప్రయోజనం లేని వృధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పాడే మరో పధం రాదా
మురళికిగల స్వరముల కల పెదవిని విడి పలుకదు కద                                          || తరలి రాద ||


పూజ - ఎన్నెన్నో జన్మల బంధం


గాయకులు: S P బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం 


సంగీతం : రాజన్-నాగేంద్ర

రచన : దాశరధి కృష్ణమాచార్యులు

_________________________________________________________________________________

పల్లవి

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది..
ఎన్నటికీ మాయని మమత నాది నీది..
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను                                             || ఎన్నెన్నో ||


చరణం 1:

పున్నమి వెన్నెలలోన పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓ హో హో హో నువ్వు కడలివైతే.. నే నదిగ మారి..
చిందులు వేసి వేసి నిన్ను చేరనా.. చేరనా.. చేరనా..                       || ఎన్నెన్నో ||


చరణం 2:

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
తావిని నేనై నిన్ను పెనవేసేను
ఓ హో హో హో మేఘము నేవై.. నెమలి నేనై..
ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..                   || ఎన్నెన్నో ||


చరణం 3:

ఆ.. ఆ.. ఓ.. ఓ.. ఆ ఆ హా హా..
కోటి జన్మలకైనా.. కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ.. నేనుండాలి
ఓ హో హో హో నీవున్న వేళా.. ఆ స్వర్గమేలా..
ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..                    || ఎన్నెన్నో || 



ఓయ్ - సరదాగా చందమామనే


గాయకులు: కార్తీక్, సునిధి చౌహాన్ 


సంగీతం : యువన్ శంకర్ రాజా

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

సరదాగా చందమామనే చేతివేళ్లపై నిలబెడతావా
పదిరంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటకట్టుకుని నింగి మధ్యలో పరిగెడుతావా
వందడుగుల నీటి మధ్యలో నిట్ట నిలువునా నిలబడతావా
నా గుండెల్లో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కోరితే ఎలాగో ఎలాగో మారి

నా ప్రేమగ నిన్ను మార్చుకున్నా ఓ.. ఆ ఆశల లొతు చూడలేనా
నీ ప్రేమగ నేను మారుతున్నా ఓ.. ఆనందపు అంచు తాకలేనా                                             || సరదాగా ||


చరణం 1:

చిగురులతోనే చీరలు నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా
అడిగినదేదో అదే ఇవ్వకుండ అంతకు మించి అందించేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా                                                   || నా ప్రేమగ ||          || సరదాగా ||


చరణం 2:

మెలకువలోన కలలను కన్నా నిజములు చేస్తావని
చిలిపిగ నేనే చినుకవుతున్నా నీ కల పండాలని ఓ..
పిలువకముందే ప్రియా అంటు నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములొనే అమృతమేదో నింపెయవా                                              || నా ప్రేమగ ||         || సరదాగా ||



ఓయ్ - 176 Beach House


గాయకులు: సిద్దార్థ్ 

సంగీతం : యువన్ శంకర్ రాజా

రచన : చంద్రబోస్
_________________________________________________________________________________

పల్లవి

176 beach house లో ప్రేమ దేవత
Yellow చుడిదార్ White చున్నితో దోచె నా యెద
ఓయ్ ఓయ్.. అంటూ casual గా పిలిచెరో
ఓయ్ ఓయ్.. 20 సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్.. empty గుండె నిండా నిలిచెరో
ఓయ్ ఓ... ఓయ్..

Love at first sight… నాలో కలిగె.. Love at first sight… నను కలిపే
Love at first sight… నాకె దొరికే.. Love at first sight… నను కొరికే                     || 176 Beach House ||


చరణం 1:

రూపం లోన beautiful చేతల్లోన dutiful మాటల్లోన fundamental
అన్నిట్లోన capable అందర్లోన careful అంతే లేని sentimental
సినీమాలొ మెరిసేటి పాట city ల్లొన దొరకదు రా
నిజంగానె తగిలెను తార Vizag నగరపు చివరన

చల్ చల్ జరిగే.. Love at First Sight.. chill కలిగే.. Love at First Sight..
పల్ పల్ పెరిగే.. Love at First Sight.. పైకెదిగే


చరణం 2:

డబ్బంటేనే allergy భక్తంటేనే energy నమ్ముతుంది numerology
ఇంటిముందు nursery అంటనీదు అల్లరి ఒప్పుకోదు humourology
ఉండాల్సింది తన వాడల్లో చేరాల్సింది military లో
ఏదో ఉంది some big తనలో లాగింది మనసును చిటికెలో

Some some వరమే.. Love at First Sight.. వా వరమే.. Love at First Sight..
uff uff క్షణమే.. Love at First Sight.. ఓ యుగమే                                               || 176 Beach House ||


నచ్చావులే - నిన్నే నిన్నే


గాయకులు: గీతా మాధురి 


సంగీతం : శేఖర్ చంద్ర

రచన : భాస్కరభట్ల రవికుమార్
_________________________________________________________________________________

పల్లవి

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా     ||2||
ప్రతీ జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావే ఓ... నచ్చావే నచ్చావులే


చరణం 1:

అనుకుని అనుకోగానే సరాసరి ఎదురౌతావు
వేరే పని లేదా నీకు నన్నే వదలవు
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ                                                             || నిన్నే నిన్నే ||


చరణం 2:

నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నదీ ఓ..
మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసు పోదు
ఈ వైనం ఇంత కాలం నా లోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగా                                                     || నిన్నే నిన్నే ||


1, అక్టోబర్ 2011, శనివారం

ప్రేమ కావాలి - చిరునవ్వే విసిరావే


గానం: విజయ్ ప్రకాష్


సంగీతం: అనూప్ రూబెన్స్


రచన: రామజోగయ్య శాస్త్రి


_________________________________________________________________________________

పల్లవి:

చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్లపై                                               || చిరునవ్వే ||


చరణం 1: 

సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సావాసంతో
విరహం చెరలో నన్నే బంధించావే ఎపుడూ మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించానే రెప్పల్లోనా తుళ్లే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమాటం  మారించావే చేరువలోనా చేసే దూరంతో
చెలియా...                                                   || చిరునవ్వే ||


చరణం 2:

అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్లింకా కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోన కబురంపించాలే
చెలియా..                                                  || చిరునవ్వే ||




శుభాకాంక్షలు - గుండె నిండా గుడి గంటలు


గాయకులు: S P బాలసుబ్రహ్మణ్యం, రేణుక


సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్


రచన: సామవేదం షణ్ముఖశర్మ

_________________________________________________________________________________

పల్లవి:

గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు,  ఎన్నో మోగుతుంటే
కళ్ల నిండా సంక్రాంతులు, సంధ్యా కాంతులు, శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా..                          || గుండె నిండా ||


చరణం 1:

చూస్తూనే మనసు వెళ్లి నీ వొళ్లో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా
పిలువదు నిమిషం నువు ఎదురుంటే
కదలదు సమయం కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా                       || గుండెనిండా ||


చరణం 2:

నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నో గాధలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా          || గుండెనిండా ||



సీమటపాకాయ్ - ధీరే ధీరే ధీరే దిల్లే


గాయకులు: కారుణ్య, గీతా మాధురి


సంగీతం: వందేమాతరం శ్రీనివాస్


రచన: భీమ్స్


_________________________________________________________________________________

పల్లవి: 

ధీరే ధీరే ధీరే దిల్ లే...  జారిపోయె నా దిల్లే పిల్లా నీవల్లే..

O my love.. come here.. come to me.. come to me..

ధీరే ధీరే ధీరే దిల్ లే                                                           || 2 ||
జారిపోయె నా దిల్లే పిల్లా నీవల్లే
ఔనా ప్రియా తొలకరినా అంతటి అల్లరినా
ఇది నీ దయే సావరియా సరసకు రా చెలియా
కలనైన కానరాదు దునియా చూపినావె నవ్వుల గుడియా


చరణం 1: 

సాథియా నయగారపు నదియా
సోఫియా మది నీకై దిల్ గయా
ఉన్నపాటుతో ఓరయ్యో దిల్ ఖోగయా
వెతికి చూడగా ఓ పిల్లగో నీకే దిల్ దియా
అరెరే అరరరరరరరరే నువ్వు రంగుల పూవుల వలయా
చలిరే  చలిరే.. రివురివ్వున ఎగిరే ఊహలు ఆశపడే చెమచెమ్మక్కురయ్యా || ధీరే ధీరే ||


చరణం 2: 

ఓ ప్రియా నువ్వు ఒంపుల సంపుటి
సుప్రియా కవ్వింపుల కుంపటి
మెల్లమెల్లగా చెంత చేరుకో సిగ్నలేవిటి
చల్ల చల్లగా హద్దు దాటుతూ ముద్దులేవిటి
ధిరరే ధిరరే... నువ్వు కౌగిలి భాషకు లిపివా
సరిలే సరిలే... నులివెచ్చని ఊపిరి పలికే తనివి తెలిపె నీ తుంటరి చలవా || ధీరే ధీరే ||



బద్రినాథ్ - నచ్చావురా



గాయకులు: శ్రీరామచంద్ర, చైత్ర


సంగీతం: ఎం ఎం కీరవాణి


రచన: ఎం ఎం కీరవాణి

_________________________________________________________________________________

పల్లవి

నచ్చావురా.. వదలనురా.. వదలనురా..
మెచ్చానురా.. జతపడరా.. జతపడరా..
వరసే మెచ్చి అడిగావేరా..
వరమే ఇచ్చి ఈ జలధారా
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా                          || నచ్చావురా ||


చరణం 1:

కనిపించేదాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడిచస్తుంది వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మొఉనభాషలను
వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా          || నచ్చావురా ||


చరణం 2:

బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
లేదా పొరపాటే చేసేమందే ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
ఆరంగనా సఖా తరించి వేరుకా
లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ వొళ్లో వాలెయ్యక               || నచ్చావురా ||


కొంచెం ఇష్టం కొంచెం కష్టం - ఓ మైనా ఏమైనా



గాయకులు: కీర్తి సాగత్య, సాధన సర్గమ్ 

సంగీతం : శంకర్-ఎహసాన్-లాయ్


రచన : రామజోగయ్య శాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

ఓ మైనా ఏమైనా ఇలా అవుతుందనుకున్నానా
ఔనన్నా కాదన్నా కాలంనన్నడిగే కదిలేన
నాతో నేనే లేనే ఒంటరిగా ఎటో ఏ వైపో వెళుతున్నా
నన్నే రారమ్మన్న రేపటిలో ఏదో కొత్తదనం కలిసేనా

హే.. పంఛీరే పంఛీరే.. నీమీదే దిల్ జారే అందంలో పిచ్చెక్కించి అల్లాడించావే
నీవెంటే వస్తానే నేతోనే ఉంటానే రోజంతా రాజాలా రాగాలే తీస్తానే


చరణం 1:

ఓ.. నిను కలిసిన వాడే తెలిసిన వాడనుకో
ఓ.. ప్రతి పరిచయము నిను పిలిచిన దారనుకో మనసా
ఎందుకో ఎందుకో నీ వైపు రానుంది ఆ వెలుగు
జతగా చెయ్యందగా నిను చేరే క్షణాలతో తేయని బదులే సాగిపో

హే పంఛీరే పంఛీరే నీమీదే దిల్ జారే నీలో ఏముందోగానీ నోరూరించావే
నాకోసం పుట్టావే అన్నట్టే వచ్చావే నువ్వంటే పడి ఛచ్చేలా నన్నే మార్చావే


చరణం 2:

ఓ.. నేనే నాకెదురైనా కనుగొనలేదు కదా
ఓ.. తడి వెలిసిన వానలో కురిసిన కాంతి ఎలా కొత్తగా
నా కథ మారిందిగా కంటి చెమ్మైన రాదు ఇక
పండగ ఈ వేడుక ఆటలాడింది చాలక దమ్ముల నడకలు నేర్పినా

హే.. పంఛీరే పంఛీరే నీ మీదే దిల్ జారే అదృష్టం అమ్మాయైతే నువ్వే అంటానే
ఎంచక్కా నవ్వావే ఎక్కిళ్లే తెచ్చావే ఏ మూలో గుండెల్లో గలాటా తెచ్చావే



కొంచెం ఇష్టం కొంచెం కష్టం - ఆనందమా.. ఆరాటమా..


గాయకులు: శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ 


సంగీతం : శంకర్-ఎహసాన్-లాయ్

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

ఆనందమా.. ఆరాటమా.. ఆలోచనా ఏమిటో.. పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దహానిదా.. స్నేహానిదా.. ఈ సూచనా ఏమిటో.. తేల్చుకో నయనమా ఎవరివీ తొలుతవీ
పట్టుకో పట్టుకో చేయి జారనీయకా ఇకనైన.. 
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయాన
ఓ.. కంటికే దూరమై గుండెకే ఎంతగా చేరువైనా.. 
నమ్మవే మనసా కనపడినది కద ప్రతి మలుపున

నిన్ను కలిసే ముందు తెలుసా ఇదేం వరసా..


చరణం 1:

యెద సడి లో చిలిపి లయ, తమ వలనే పెరిగెనయా
తను తనువే తెలుపవయా ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ, ప్రియా..
ఒక క్షణము తోచనేవుగా కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడకా అదే పనిగా..

ఓ.. నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఓ.. ముందుగా చెప్పకా మంత్రమేశావే న్యాయమేనా
అందుకే ఇంతగా కొలువై ఉన్నా నీలోనా
కొతగా మార్చనా నను మరి కని విని మరిపించన                                          || ఆనందమా.. ||


పట్టుకో పట్టుకో చేయి జారనీయకా ఇకనైన.. 
ఓ.. చుట్టుకో చుట్టుకో ముడి పడిపోయే మురిపాన
ఓ.. ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా.. 
కళ్లల్లో పెట్టుకో ఎదురుగ నిలవన ఎటు తిరిగిన



కిల్లర్ - ప్రియా ప్రియతమా రాగాలు


గాయకులు: మనో, చిత్ర 


సంగీతం : ఇళయరాజా

రచన : వేటూరి సుందర రామ్మూర్తి

_________________________________________________________________________________

పల్లవి

ప్రియా ప్రియతమా రాగాలు సఖీ కుశలమా అందాలు                      ||2||
నీ లయ పంచుకుంటుంటే నా శ్రుతి మించిపోతుంటే
నాలో రేగే                                                                                                  || ప్రియా ప్రియతమా ||


చరణం 1:

జగాలు లేని సీమలో యుగాలు దాటి ప్రేమలో
పెదాల మూగ బాటలో పదాలు పాడే ఆశలో
ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి
అడుగు దాటే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం నీలో నాలో పలికే                                            || ప్రియా ప్రియతమా ||


చరణం 2:

శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నులా
షికారు చేసే కోకిల పుకారు రేపే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురు వేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం నిన్నూ నన్నూ కలిపే                                         || ప్రియా ప్రియతమా ||



30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మర్యాద రామన్న - ఉద్యోగం ఊడిపోయింది


గాయకులు: రంజిత్ 


సంగీతం : ఎం ఎం కీరవాణి

రచన : రామజోగయ్య శాస్త్రి
_________________________________________________________________________________

పల్లవి

ఉద్యోగం ఊడిపోయింది.. పోయిందా.. పొ. పొ. పొ. పోయిందా
సద్యోగం సందెకెళ్లింది.. గోయిందా.. గొ. గొ. గొ. గోయిందా
గోదారీ ఈదాలంటే కుక్కతోకైనా లేదండి ఏ దేవుణ్నడగాలన్నా హుండీకి చిల్లర లేదు
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది.. పులుసుగారిపోతుంది..

ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది.. ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది..
ఎందుకిలా నా ఖర్మ.. నా ఖర్మ.. నా ఖర్మ.. కాలిపోయిందెహె..

My life, తలకిందులు కిందులు.. 
My work, తలకిందులు కిందులు.. 
Everything, తలకిందులు కిందులు.. Here we go..

.. తలకిందులు కిందులు .. తలకిందులు కిందులు .. తలకిందులు కిందులు ..


చరణం 1:

ఎవడండీ బాబు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు.. 
కృషి ఉంది, దుర్భిక్షం కూడా ఉంది
షికిలాపా లక లక లా పా... షికిలాపా లక లక లా...
చెమటోడ్చే మనుషులకే ఏ లోటు రానే రాదంటారు.. 
ఏమైంది, ఆ చెమటేగా మిగిలింది
చీ అంది.. చెతిలో గీత, నలిగింది.. నుదుటిపై రాత
టోటల్ గా.. చీకటయ్యింది లైఫంతా                                                             || పెదవి ఎండిపోతుంది ||


చరణం 2:

శని బాబాయి షాడోలా వెంటాడుతున్నాడేమో నన్ను.. 
పని లేదు, పాకెట్లో పైసా లేదు
షికిలాపా లక లక లా పా... షికిలాపా లక లక లా...

దురదృష్టం ఐస్కాంతంలా లాగుతున్నాదనుకున్నాను.. 
ఏం చెయను, నే ఐరన్ లెగ్గయ్యాను

బిచ్చమెత్తరా.. సిగ్గు పడతాను, జేబు కత్తెర.. వెయ్యనేలేను
చచ్చిపో మరి.. అంత పని చచ్చినా బాబోయి నే చెయ్యలేను

లక్కు లాగి తన్నింది, తుక్కు లేచిపోయింది, తిక్క తీరిపోతుంది                     || ఎందుకిలా నా ఖర్మ ||



మర్యాద రామన్న - తెలుగమ్మాయి


గాయకులు: ఎం ఎం కీరవాణి, గీతా మాధురి 


సంగీతం : ఎం ఎం కీరవాణి

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

రాయలసీమ మురిసిపడేలా.. రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది మూడుముళ్లు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్లల్లో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకోమన్నది నిన్ను తన చేయి


చరణం 1:

పలికే పలుకుల్లో వొలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్లే లాహిరి
జంటై కలిసిందో కలిపేయి హరీ
హంసల నడకల వయ్యారి అయిన యేడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే                                           || తెలుగమ్మాయి ||

ఎహె ఆపండి ఎదవ గోల...
రోజూ పిచ్చి గీతలు గీసుకుంటూ కూర్చుంటుంది. దాన్ని నేను చేసుకోవాలా


చరణం 2:

గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా, వానలో గొడుగులా
గువ్వపై గూడులా, కంటి పై రెప్పలా
జత పడే జన్మకి, తోడు ఉంటానని
మనసులో మాటని మనకు చెప్పకనే చెబుతుంది                                             || తెలుగమ్మాయి ||



కుర్రాడు - ఏమంటావే


గాయకులు: కార్తీక్ 


సంగీతం : అచ్చు

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే, తోడౌతావే, నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది, నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే                                                            || ఏమంటావే ||


చరణం 1:

సంతోషం ఉన్నా సందేహం లోన.. (లోన)
ఉంటావే ఎన్నాళ్లైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా, సొంతం కాలేనా.. (లేనా)
అంటుందే ఏరోజైనా నీ జత కోరే జన్మ
జవ్వనమా, జమున వనమా, ఓ జాలే లేదా జంటై రావే ప్రేమా                     || ఏమంటావే ||


చరణం 2:

అందాలనుకున్నా నీకే ప్రతి చోట.. (చోట)
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా నీకే ప్రతి పూట.. (పూట)
వందేళ్లు నాతో ఉంటే వాడదు ఆశల కొమ్మ
అమృతమా అమితహితమా, ఓ అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా                   || ఏమంటావే ||


ఏక్ నిరంజన్ - అమ్మా లేదు నాన్న లేడు



గాయకులు: రంజిత్ 

సంగీతం : మణిశర్మ


రచన : రామజోగయ్య శాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

అమ్మా లేదు నాన్న లేడు అక్కా చెల్లి తంబి లేరు.. ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు.. ఏక్ నిరంజన్
ఊరె లేదు నాకో పేరే లేదు నీడా లేదు, నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్లే రావసలే
నాకంటూ ఎవరూ లేరు, కన్నీళ్లే లేవసలే

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఎహె ఒంటరివాణ్నే                                            || అమ్మా లేదు ||


చరణం 1:

c/o platform.. s/o Bad Time.. ఆవారా.com
ఏ దమ్ మారో దమ్ Tons of Freedom మనకదేరా Problem
అరె Date of Birth తెలియదే పెను గాలికి పెరిగానే
ఏ జాలీ జోలా ఎరుగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వరు లే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేదే                        || పది మందిలో ||         || అమ్మా లేదు ||


చరణం 2:

Dil is burning, Full of Feeling, No one is Caring
That’s ok యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుంది ఎహ
రోజంతా నాతో నేనే కల్లోను నేనేలే
తెల్లారితే మళ్లీ నేనే తేడాలే నే లేదే                                  || పది మందిలో ||

అమ్మా లేదు నాన్న లేడు అక్కా చెల్లి తంబి లేరు.. ఏక్ నిరంజన్ 
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సుబుస్సులాడే లస్కూ లేదు ఏక్ నిరంజన్

డార్లింగ్ - నీవే.. నీవే..


గాయకులు: G V ప్రకాష్ కుమార్

సంగీతం : G V ప్రకాష్ కుమార్

రచన : అనంత్ శ్రీరామ్



_________________________________________________________________________________

పల్లవి

నీవే.. నీవే.. నీవే.. నీవే.. నీవే.. నీవే.. నీవే.. నీవే.. || 2 ||

ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే అనిజరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వెళ్తున్నా
కదిలిస్తూ ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గురుతొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా                                                       || నీవే.. నీవే.. ||


చరణం 1:
ఓ నిముషంలోన సంతోషం ఒక నిముషంలోన సందేహం
నిదురను కూడా హే నీ ధ్యానం వదలదు నన్నే ఓ నీ రూపం
నువ్వే హే.. నువ్వే.. నువ్వే.
ఆలొచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే చెలియా..                                    || ఎదురొస్తూనే ||          || నీవే.. నీవే.. ||


చరణం 2:

నడకలు సాగేది నీవైపే పలుకులు ఆగింది నీవల్లే
ఎవరికి ఛెబుతున్న నీ ఊసే చివరికి నేనయ్యా నీ లానే
నువ్వే హే.. నువ్వే.. నువ్వే.
చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే విననే                                       || ఎదురొస్తూనే ||          || నీవే.. నీవే.. ||



అల్లరి మొగుడు - ముద్దిమ్మంది

గాయకులు: ఎస్.పి.బాలు, చిత్ర 

సంగీతం : ఎం.ఎం.కీరవాణి 

రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ                                                || ముద్దిమ్మంది ||


చరణం 1:

ముందరున్న ముద్దరాలి ముద్దు చెల్లిద్దు ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి మత్తు కలిగిద్దు ఇటు రద్దు
పెదవి పొడుపుకథ విప్పేద్దు చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు చంపేద్దు బెట్టు
అనువైన అందుబాటు చూడమంది                                         || ముద్దిమ్మంది ||


చరణం 2:

వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు జడ కిందు
నిదర నదిని కసుకందేలా కరిగిద్దు పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు హద్దు
సడిలేని సద్దుబాటు చేయమంది                                             || ముద్దిమ్మంది ||


29, సెప్టెంబర్ 2011, గురువారం

రంగం - ఎందుకో ఏమో


గాయకులు: ఆలాప్ రాజు

సంగీతం : హారిస్ జైరాజ్

రచన : వనమాలి


_________________________________________________________________________________

పల్లవి

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసే..
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే..
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం.. రేపో దరికనని దరికనని తీరం..
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం.. రోజూ తడబడుతూ వెలిగేటి ఉదయం..
ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే, చేరి దూరమయ్యె వరసే, రేయి కలలుగ వెలిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే, చిన్ని గుండెనేదో తొలిచే, ఒంటరిగ నను విడిచే                || ఏదో గజిబిజిగా ||
నువ్వు నేను ఒక యంత్రమ కాలం నడిపే ఓ మహిమా ప్రేమా...


చరణం 1:

ముద్దులిడిన ఊపిరి సెగలో తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తూఫానే.. 
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే                                               || ఏమో తుళ్ళి ||                     || నువ్వు నేను ||

Let’s Go Wow Wow…
Really తెలీదమ్మా ఎందుకో ఏమో You’re Looking so Flair.. 
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే Lovely చెప్పకనే చెప్పే.. ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
There U looking like a Cindrella Cindrella, NOD i లుక్కులిచ్చె ఈ వేళ
There U looking like a Cindrella Cindrella, నన్ను చుట్టుముట్టె వెన్నెల్లా                     || 2 ||


చరణం 2:

నిలవనీక నిను తెగ వెతికే కనుల కిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా కన్నుల్నే పొందాను.. 
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతాను 
నీడనే దోచే పాటే నేను                                                                                                      || ఏమో తుళ్ళి ||



శశిరేఖా పరిణయం - నిన్నే నిన్నే


గాయకులు: చిత్ర 

సంగీతం : మణిశర్మ


రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

నిన్నే నిన్నే అల్లుకొని, కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకొని, కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతీ పూట పువ్వై పుడతా, నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెలనౌతా, నువ్వే నెలవు తీరేలా
నూరేళ్లు నన్ను నీ నివేదనవని                                                    || నిన్నే నిన్నే ||


చరణం 1:

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా..                        || నిన్నే నిన్నే ||


చరణం 2:

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలాసమా
కొంగు ముళ్లలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా 
ఆయువంత వెలిగించి హారతీయనా......                                          || నిన్నే నిన్నే ||


ఉల్లాసంగా ఉత్సాహంగా - ఎంత అందమో (ప్రియతమా)



గాయకులు: సోను నిగమ్, రాహుల్ నంబియార్ 

సంగీతం : G V ప్రకాష్ కుమార్

రచన : అనంత్ శ్రీరామ్



_________________________________________________________________________________

పల్లవి

నాననాననా నాననాననా నాననాననా నాననే.. || 2 ||
ఎంత అందమో ఎంత అందమో నమ్మలేను నా కళ్లనే
ఎంతసేపిలా ఎంతచూసినా నిన్ను వీడి నే వెళ్లనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఎంటో తెలీలేదే ఎలా ఎలా                                                         || ఇలా వచ్చి ||

ప్రియతమా.. తిరుగులేని సౌందర్యమా
ప్రియతమా.. తరిగిపోని లావణ్యమా
ప్రియతమా.. విరగబూసే వాసంతమా
ప్రియతమా.. ఉరకలేసే వయ్యారమా

నాకోసం నేలపైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెళ్తావా..                                                                     || ఇంత / ఇలా ||


చరణం 1:

సఖీ చెలీ సఖీ చెలీ సుధా మాధురీ
నిజానికీ నువ్వే మరి సదా నా సిరీ
గులాబిలో శ్వాసై చేరగా చలాకిగా నీలా మారదా
O baby U R my love.. I can feel u everytime..          || 2 ||

ఓ.. చేమంతికైన పూబంతికైన లేదింత సున్నితం..                || నా కోసం ||            || ఇలా వచ్చి ||


చరణం 2:

ప్రియా అని ప్రియా అని పిలుస్తావని
నరాలలో ప్రతి కణం నిరీక్షించనీ
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతీ క్షణం ఉన్నా ఆశతో
O baby U R my life I can save you everytime..        || 2 || 

ఓ.. నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతలే..                   || నా కోసం ||            || ప్రియతమా.. ||



వస్తాడు నా రాజు - కలగనే వేళ



గాయకులు: శ్రీరామచంద్ర, సైంధవి 

సంగీతం : మణిశర్మ

రచన : భాస్కరభట్ల రవికుమార్
_________________________________________________________________________________

పల్లవి

కలగనే వేళ నిలవదే ప్రాయం
ఎదురయే వేళ ఎగరదా ప్రాణం
చిలిపి ఊహలలోన తెలియదే సమయం
వలపు దారులలోనా మలుపులే మధురం
ఏం మహిమ చూపిందో ప్రణయం అడగమంటోందీ హృదయం తనువు తనువంతా ఒకలాంటి సంబరం
ఏ మనసు పడుతుంటే తకఝుం మతులు చెడిపోవడం సహజం మనకు మనమంటూ మిగలం     || కలగనే వేళ ||


చరణం 1:

నదినొదిలి పడవుండేదెలా జాబిలినొదిలి వెన్నెలుండేదెలా నిన్నొదిలి నేనుండేదెలా మనసా ఓ..
తొలకరిగా నువ్వు గమ్మత్తుగా నీ తలపులలో నను ముంచెత్తగా కౌగిలిలో నేను కొవ్వొత్తిలా కరిగా ఓ..
నీ నవ్వుల్లోనే నవరత్నాలు రాలు
నూరేళ్లపాటు నీ తోడుంటే చాలు                                                                                             || ఏం మహిమ ||


చరణం 2:

పరిచయమే తొలి సంక్రాంతిలా ఈ పరిమళమే కొత్త ఉగాదిలా పరవశమే నాకు దీవాలిలా ఉంది ఓ..
వదలనుగా నా ఆశాలత నీ వలన కదా ఈ ఉష్ణోగ్రత నీమీదనే నా ఏకాగ్రత ఉంది ఓ..
నీ సంతకాలు మది నిండాయి చూడు
ఈ జ్ఞాపకాలు ఇక చెరిగేవి కాదు.                                                                                            || ఏం మహిమ ||



27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆవారా - నీ యెదలో నాకు



గాయకులు: యువన్ శంకర్ రాజా 

సంగీతం : యువన్ శంకర్ రాజా


రచన : చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

నీ యెదలో నాకు చోటే వద్దు నా యెదలో చోటే కోరవద్దు
మన యెదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీతోటే ప్రేమ పోతే పోనీ అని అబద్ధాలు చెప్పలేనులే
నీ జతలోన.. నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన.. నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం                                      || నీ యెదలో నాకు ||

చరణం 1:

చిరుగాలి తరగంటి నీ మాటకే యెద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే తను ఊగేను తొలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగ చూపేదో పురి విప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది
నువు వల వేస్తే.. నువు వల వేస్తే నా యెద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుటుంటే వీచే చెలి స్నేహం

చరణం 2:

ఒకసారి మౌనంగ నను చూడవే ఈ నిమిషమె ఓ యుగమవునులే
నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమవునులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగె ఎన్నెన్ని ముని మాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో తూగాడెనే
తొలి సందెలలో.. తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో.. మలి సందెలలో నీ పాపిటిలో ఎర్ర మందారం                                || నీ యెదలో నాకు ||



ఆవారా - చిరు చిరు చిరు



గాయకులు: హరిచరణ్, తన్వి 

సంగీతం : యువన్ శంకర్ రాజా 

రచన : చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగైపోయావే
నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ గొళం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
చెయి చెయి చెలిమిని చెయి అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదమ్ కదిలినదే
యెదనే నీతో యెత్తుకెళ్లావే                                                                                                  || చిరు చిరు చిరు ||

చరణం 1:

దేవతా.. తనే ఒక దేవత, ముఖాముఖి అందమే చూడగ ఆయువే చాలునా
గాలిలో.. తనే కదా పరిమళం, చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలలే ఆడేవేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్లే ముద్దుల్తోనే తడిమెయ్యలా చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
యెదనే తనతో యెత్తుకెళ్లిందే                                                                   || చెయి చెయి ||

చరణం 2:
తోడుగా ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందనా
నేలపై పడెయ్యక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయం తోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగ నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తీయగ వేధిస్తుందే 
యెదనే తనతో యెత్తుకెళ్లిందే..                                                                || చెయి చెయి ||       || చిరు చిరు చిరు ||



ఊసరవెల్లి - నిహారికా నిహారికా



గాయకులు: విజయ్ ప్రకాష్, నేహ భసిన్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

రచన : అనంత్ శ్రీరామ్



_________________________________________________________________________________

పల్లవి

నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారికా నిహారికా నువ్వే నేనిక
నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక నిహారికా నిహారికా నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే                           || నిహారికా ||

నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

చరణం 1:

రెండు రెప్పలు మూతపడవుగా నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే
రెండు చేతులు ఉరుకోవుగా నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగ నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నాచెంతకొచ్చినావో నిన్నింక వదులుకోను చెయ్యందుకో..                              || నిహారికా ||

చరణం 2:

నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పు లాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది
జీవితానికివ్వాళే చివరి రోజు అన్నట్టు మాటలాడుతున్నావుగా
ఎన్ని మాటలవుతున్నా కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా                               || నిహారికా ||




కత్తి - ఏమవుతుంది గుండెలో



గాయకులు: శ్రీరామచంద్ర

సంగీతం : మణిశర్మ

రచన : బాలాజి


_________________________________________________________________________________

పల్లవి

ఏమవుతుంది గుండెలో నేనున్నాను మాయలో
ఏచోటున్న కన్నులో నను చూశాయి ప్రేమతో
ఏకాంతం కాదిదీ నాలో సగమే కరిగి కదిలి నాకే ఎదురౌతున్నది
యేచోటా లేనిదీ నేడే మనసై కనులు కలిపి హృదయం దోచేస్తున్నది

మనసే రోజూలా లేదు ఉరుకుతోంది నా ముందు
కాలం కదిలేలా లేదు చేసుకుంది నను ఖైదు
కొత్తగ లోకం చూస్తున్నా చంటిపాపనౌతున్నా
ఏమని చెప్పను ఏమైనా యెదకు బదులు నేనున్నా                                           || ఏమవుతుంది ||

చరణం 1:

గాలమేసుకుంది ప్రాణాలు లాగుతోంది నా గుండెల్లో ప్రేమ
ఊపిరాడకుంది శ్వాస పట్టుకుంది ఈ నిమిషంలో ప్రేమ
చిరుకానుకై తొలి వేడుకై తను మొదలవుతుంది ప్రేమ
ఔననో మరి కాదనో మది చెడగొడుతుంది ప్రేమ

రెక్కలకోసం వెతికేనా చినుకు నేల పడుతున్నా
రెక్కలు దారే మూస్తున్నా మనసు అడుగులాపేనా
చుక్కలు తాకే ఊహేనా ఎగురుతోంది నాలోనా
మొన్నా నిన్నా నేనున్నా నేటి నుంచి ఎవరోనా


చరణం 2:

నేల తేలుతోంది ఆకాశమందుతోంది ఏ చిత్రం ఈ ప్రేమ
గాలి తాకుతోంది తుఫాను లాగ ఉంది ఏ మంత్రం ఈ ప్రేమ
ఈ నీదిలా పన్నీరులా యెద తడిపేస్తుంటే ప్రేమ
అమ్మలా నను కమ్మగా తెగ లాలిస్తుంటే ప్రేమ

ఒంటరిగా నేనున్నా ఎంతమందిలో ఉన్నా
పరుగులు తీసే వయసున్నా మనసు దాటలేకున్నా
పెదవుల మధ్యే దాగున్నా దొరకలేదు మాటైనా
తీయని గాయం అవుతున్నా తెలపలేదు ఆశైనా                                                || ఏమవుతుంది ||



దూకుడు - గురువారం మార్చి 1



గాయకులు: రాహుల్ నంబియార్

సంగీతం : థమన్ ఎస్. ఎస్.

రచన : రామజోగయ్య శాస్త్రి


_________________________________________________________________________________

పల్లవి

గురువారం మార్చి 1, సాయంత్రం 5:40
తొలిసారిగా చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను                                             || గురువారం ||

రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేనా యే మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర సున్ తో జర జానే జానా దిల్ సే తుఝ్ కో ప్యార్ కియా హై దీవానా
నీపై జాణా ప్రేమ ఉందే గుండెల్లోనా సోచో జానా ప్యార్ సె దిల్ కో సంఝో నా
I Love you బోలో నా హసీనా


చరణం 1:

నువ్వాడే perfume, గుర్తొస్తే చాలే.. మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే.. ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
Climate అంతా నా లాగే లవ్ లో పడిపోయిందేమో అన్నట్టుందే crazy గా ఉందే
నింగీ నేలా తలకిందై కనిపించే జాదూ ఏదో చేసేశావే.. 
ఓం శాంతి శాంతి అనిపించావే                                                                                              || జర జర ||


చరణం 2:

గడియారం ముల్లై తిరిగేస్తున్నానే.. ఏ నిమిషం నువ్వు I Love You అంటావో అనుకుంటూ
Calendar కన్నా ముందే ఉన్నానే.. నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎపుడంటూ
Daily Routine Total గా నీవల్లే change అయ్యిందే చూస్తూ చూస్తూ నిను follow చేస్తూ
అంతో ఇంతో decent కుర్రాణ్ణి ఆవారాగా మార్చేశావే ఓం శాంతి శాంతి అనిపించావే

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా చెలియ లా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం



26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఆర్య - ఏదో ప్రియ రాగం



గాయకులు: సాగర్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

రచన : విశ్వ


_________________________________________________________________________________

పల్లవి

యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో.. ప్రేమా ఆ సందఢి నీదేనా
యేదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో.. ప్రేమా ఆ సవ్వఢి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా.. ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే

నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం, నువ్వుంటే ప్రతి క్షణమూ స్వర్గం, నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం


చరణం 1:

పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం.. అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం.. ఎల్లదాటి పరవళ్లు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం.. ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం

నువ్వుంటే ప్రతి ఆశా సొంతం, నువ్వుంటే చిరుగాలే గంధం, నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాటా వేదం, నువ్వుంటే ప్రతి పలుకూ రాగం, నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం


చరణం 2:

ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా.. చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన.. ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే.. సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా

నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ పోదే, నువ్వుంటే మరి మాఠలు కూడా పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే, నువ్వుంటే అలుపంటూ రాదే, నువ్వుంటే ఏ కష్ఠాలైనా ఎంతో ఇష్టాలే



ఆర్య - You Rock My World




గాయకులు: షాన్


సంగీతం : దేవి శ్రీ ప్రసాద్


రచన : విశ్వ

_________________________________________________________________________________

పల్లవి

Whats up!!! r u ready to break it down? Yeah..
And keep it a real? Yeah.. Let’s get ready to rumble.. Stop..
ఓ.. ఆ.. ఓ ఏ యో ఆ.. ఓ.. ఆ.. ఓ ఏ యా ఓ.. || 2 ||

You rock my world you know, U stay in my heart u know మై హూ తేరా దీవానా
Don’t walk away.. from me, U gotta listen to me చేస్తా నీకోసం ఏదైనా
ఆవోనా, ఓ.. జర దేఖోన, ఓ.. ఎవరేమన్నా జరిగేదుంటే జరగక మానేనా
జానోనా, ఓ.. జర సున్ లే నా, ఒ.. మనసే ఉంటే మార్గాలెన్నో సమ్ఝోనా                        || U Rock My World ||


చరణం 1:

Be Ready.. Everybody.. Love అంటేనే గుండెను తాకే తీయని melody
Nobody.. can tell u really.. ఎప్పుడు ఎక్కడ మొదలౌతుందో ప్రేమ గారడీ హే..
నాచోనా, ఓ.. జర ఝూమోనా, ఓ.. ప్రేమిస్తే అరె మనసంతా మరి అల్లరి తిల్లాన
ఓ జానా, ఓ.. జర మానోనా, ఓ.. ప్రేమను మించిన పవరే లేదు లోకాన                        || U Rock My World ||


చరణం 2:

ఓ గీత.. Senorita.. స్నేహం కోరి చెయ్యందిస్తే చూడవు ఎంచేత
నీ జత ఆహ.. నాకో వింత.. నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత
ఔనన్నా, నువు కాదన్నా, నాలో ఉన్నది నువ్వేనన్నది నిజమే ఓ మైనా
ఎండైనా, మరి వానైనా, నీవెంటే నేనుంటానంట ఏమైన                                              || U Rock My World ||