27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆవారా - చిరు చిరు చిరు



గాయకులు: హరిచరణ్, తన్వి 

సంగీతం : యువన్ శంకర్ రాజా 

రచన : చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

చిరు చిరు చిరు చినుకై కురిశావే మరుక్షణమున మరుగైపోయావే
నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ గొళం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
చెయి చెయి చెలిమిని చెయి అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదమ్ కదిలినదే
యెదనే నీతో యెత్తుకెళ్లావే                                                                                                  || చిరు చిరు చిరు ||

చరణం 1:

దేవతా.. తనే ఒక దేవత, ముఖాముఖి అందమే చూడగ ఆయువే చాలునా
గాలిలో.. తనే కదా పరిమళం, చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా
సిగలో కురులే మేఘాలలే ఆడేవేళ గుండెల్లోన మెరుపే మెరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్లే ముద్దుల్తోనే తడిమెయ్యలా చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
యెదనే తనతో యెత్తుకెళ్లిందే                                                                   || చెయి చెయి ||

చరణం 2:
తోడుగా ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమె నా స్పందనా
నేలపై పడెయ్యక నీడనే చక చక చేరనా ఆపనా గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయం తోటే కట్టేసిందే గాయం లేక కోసేసిందే హాయిగ నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే తీయగ వేధిస్తుందే 
యెదనే తనతో యెత్తుకెళ్లిందే..                                                                || చెయి చెయి ||       || చిరు చిరు చిరు ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి