30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కుర్రాడు - ఏమంటావే


గాయకులు: కార్తీక్ 


సంగీతం : అచ్చు

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే, తోడౌతావే, నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది, నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే                                                            || ఏమంటావే ||


చరణం 1:

సంతోషం ఉన్నా సందేహం లోన.. (లోన)
ఉంటావే ఎన్నాళ్లైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా, సొంతం కాలేనా.. (లేనా)
అంటుందే ఏరోజైనా నీ జత కోరే జన్మ
జవ్వనమా, జమున వనమా, ఓ జాలే లేదా జంటై రావే ప్రేమా                     || ఏమంటావే ||


చరణం 2:

అందాలనుకున్నా నీకే ప్రతి చోట.. (చోట)
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా నీకే ప్రతి పూట.. (పూట)
వందేళ్లు నాతో ఉంటే వాడదు ఆశల కొమ్మ
అమృతమా అమితహితమా, ఓ అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా                   || ఏమంటావే ||


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి