30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఏక్ నిరంజన్ - అమ్మా లేదు నాన్న లేడు



గాయకులు: రంజిత్ 

సంగీతం : మణిశర్మ


రచన : రామజోగయ్య శాస్త్రి

_________________________________________________________________________________

పల్లవి

అమ్మా లేదు నాన్న లేడు అక్కా చెల్లి తంబి లేరు.. ఏక్ నిరంజన్
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు.. ఏక్ నిరంజన్
ఊరె లేదు నాకో పేరే లేదు నీడా లేదు, నాకే తోడూ లేదు
నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్లే రావసలే
నాకంటూ ఎవరూ లేరు, కన్నీళ్లే లేవసలే

పది మందిలో ఏకాకినీ నా లోకమే వేరే
ఇరగేసినా తిరగేసినా నేనెప్పుడూ ఎహె ఒంటరివాణ్నే                                            || అమ్మా లేదు ||


చరణం 1:

c/o platform.. s/o Bad Time.. ఆవారా.com
ఏ దమ్ మారో దమ్ Tons of Freedom మనకదేరా Problem
అరె Date of Birth తెలియదే పెను గాలికి పెరిగానే
ఏ జాలీ జోలా ఎరుగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వరు లే
ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేదే                        || పది మందిలో ||         || అమ్మా లేదు ||


చరణం 2:

Dil is burning, Full of Feeling, No one is Caring
That’s ok యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుంది
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుంది ఎహ
రోజంతా నాతో నేనే కల్లోను నేనేలే
తెల్లారితే మళ్లీ నేనే తేడాలే నే లేదే                                  || పది మందిలో ||

అమ్మా లేదు నాన్న లేడు అక్కా చెల్లి తంబి లేరు.. ఏక్ నిరంజన్ 
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సుబుస్సులాడే లస్కూ లేదు ఏక్ నిరంజన్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి