30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మర్యాద రామన్న - తెలుగమ్మాయి


గాయకులు: ఎం ఎం కీరవాణి, గీతా మాధురి 


సంగీతం : ఎం ఎం కీరవాణి

రచన : అనంత్ శ్రీరామ్

_________________________________________________________________________________

పల్లవి

రాయలసీమ మురిసిపడేలా.. రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది మూడుముళ్లు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్లల్లో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకోమన్నది నిన్ను తన చేయి


చరణం 1:

పలికే పలుకుల్లో వొలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్లే లాహిరి
జంటై కలిసిందో కలిపేయి హరీ
హంసల నడకల వయ్యారి అయిన యేడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన జాబిలి తునకే                                           || తెలుగమ్మాయి ||

ఎహె ఆపండి ఎదవ గోల...
రోజూ పిచ్చి గీతలు గీసుకుంటూ కూర్చుంటుంది. దాన్ని నేను చేసుకోవాలా


చరణం 2:

గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా, వానలో గొడుగులా
గువ్వపై గూడులా, కంటి పై రెప్పలా
జత పడే జన్మకి, తోడు ఉంటానని
మనసులో మాటని మనకు చెప్పకనే చెబుతుంది                                             || తెలుగమ్మాయి ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి