29, సెప్టెంబర్ 2011, గురువారం

వస్తాడు నా రాజు - కలగనే వేళ



గాయకులు: శ్రీరామచంద్ర, సైంధవి 

సంగీతం : మణిశర్మ

రచన : భాస్కరభట్ల రవికుమార్
_________________________________________________________________________________

పల్లవి

కలగనే వేళ నిలవదే ప్రాయం
ఎదురయే వేళ ఎగరదా ప్రాణం
చిలిపి ఊహలలోన తెలియదే సమయం
వలపు దారులలోనా మలుపులే మధురం
ఏం మహిమ చూపిందో ప్రణయం అడగమంటోందీ హృదయం తనువు తనువంతా ఒకలాంటి సంబరం
ఏ మనసు పడుతుంటే తకఝుం మతులు చెడిపోవడం సహజం మనకు మనమంటూ మిగలం     || కలగనే వేళ ||


చరణం 1:

నదినొదిలి పడవుండేదెలా జాబిలినొదిలి వెన్నెలుండేదెలా నిన్నొదిలి నేనుండేదెలా మనసా ఓ..
తొలకరిగా నువ్వు గమ్మత్తుగా నీ తలపులలో నను ముంచెత్తగా కౌగిలిలో నేను కొవ్వొత్తిలా కరిగా ఓ..
నీ నవ్వుల్లోనే నవరత్నాలు రాలు
నూరేళ్లపాటు నీ తోడుంటే చాలు                                                                                             || ఏం మహిమ ||


చరణం 2:

పరిచయమే తొలి సంక్రాంతిలా ఈ పరిమళమే కొత్త ఉగాదిలా పరవశమే నాకు దీవాలిలా ఉంది ఓ..
వదలనుగా నా ఆశాలత నీ వలన కదా ఈ ఉష్ణోగ్రత నీమీదనే నా ఏకాగ్రత ఉంది ఓ..
నీ సంతకాలు మది నిండాయి చూడు
ఈ జ్ఞాపకాలు ఇక చెరిగేవి కాదు.                                                                                            || ఏం మహిమ ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి