27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆవారా - నీ యెదలో నాకు



గాయకులు: యువన్ శంకర్ రాజా 

సంగీతం : యువన్ శంకర్ రాజా


రచన : చంద్రబోస్

_________________________________________________________________________________

పల్లవి

నీ యెదలో నాకు చోటే వద్దు నా యెదలో చోటే కోరవద్దు
మన యెదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే
నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే
నీతోటే ప్రేమ పోతే పోనీ అని అబద్ధాలు చెప్పలేనులే
నీ జతలోన.. నీ జతలోన ఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన.. నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం                                      || నీ యెదలో నాకు ||

చరణం 1:

చిరుగాలి తరగంటి నీ మాటకే యెద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే తను ఊగేను తొలి పల్లవై
ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగ చూపేదో పురి విప్పెనే
కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది
నువు వల వేస్తే.. నువు వల వేస్తే నా యెద మారే నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుటుంటే వీచే చెలి స్నేహం

చరణం 2:

ఒకసారి మౌనంగ నను చూడవే ఈ నిమిషమె ఓ యుగమవునులే
నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమవునులే
నిన్ను చూసేటి నా చూపులో కరిగె ఎన్నెన్ని ముని మాపులో
పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో తూగాడెనే
తొలి సందెలలో.. తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో.. మలి సందెలలో నీ పాపిటిలో ఎర్ర మందారం                                || నీ యెదలో నాకు ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి