14, నవంబర్ 2011, సోమవారం

నాలుగు స్తంభాలాట - చినుకులా రాలి


సంగీతం: రాజన్-నాగేంద్ర


గానం: S P బాలసుబ్రహ్మణ్యం, P సుశీల


రచన: వేటూరి సుందరరామ్మూర్తి

_________________________________________________________________________________


పల్లవి:


చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ.
నదివి నీవు, కడలి నేను,
మరిచిపోబోకుమా మమత నీవే సుమా                                                || చినుకులా రాలి ||


చరణం 1:


ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచిఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లని గాలులే

హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ.. నా ప్రేమ.. నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా
విడిచిపోబోకుమా విరహమైపోకుమా                                                    || చినుకులా రాలి ||



చరణం 2:


తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుటున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం  వెసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నీడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై యెగసి
నీ ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ
భువనమైనా, గగనమైనా,
ప్రేమమయమే సుమా.. ప్రేమమనమే సుమా                                          || చినుకులా రాలి ||



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి